పెళ్లి చూపులకు వేదికైన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ స్టేజి
on Mar 12, 2025
సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో వేరే లెవెల్ లో ఉంది. ఇక ఇందులో చాలా సీరియల్స్ నటీనటులు పోటీ పడుతూ ఉన్నారు. జీ తెలుగు సీరియల్స్ దేనికదే సాటి అని చెప్పొచ్చు. ఇక అన్ని సీరియల్స్ లోకి మేఘ సందేశం సీరియల్ మాత్రం టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ సీరియల్ జోడి అందరికీ ఇష్టమైన జోడి గగన్ - భూమి. ఇప్పుడు ఈ సీరియల్ జోడి సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళతో స్పెషల్ గా రిలీజయిన ఈ ప్రోమో ఇప్పుడు ఆడియన్స్ మనసులను దోచుకుంటోంది. ఒకసారి ఈ ప్రోమో చూస్తే ..పెళ్లి చూపాలకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఎదురెదురుగా కూర్చోబెట్టారు. భూమి తెగ సిగ్గుపడిపోతూ తలదించుకుంది.
అప్పుడు యాంకర్ రవి "ఏంటి మీరిద్దరూ ఇదేనా ఫస్ట్ టైం చూసుకోవడం" అని అడిగాడు. దానికి భూమి "నేను ఇంకా చూడలేదు" అని ఆన్సర్ ఇచ్చింది. ఐతే వెనక స్క్రీన్ మీద ఒక సీన్ ప్లే చేశారు. మరి ఇదేంటి అంటూ ఆ సీన్ చూసాడు. అందులో భూమి నోట్లో ఉన్న యాపిల్ ని గగన్ తన నోటితో కొరుకుతూ ఉంటాడు అది కూడా గగన్ గాల్లో తేలుతూ. ఇక ఇది చూసాక అష్షు కౌంటర్ వేసింది. "మనమూ తిన్నాము ఆపిల్స్ కానీ ఇలాంటి ఆపిల్ ని ఎప్పుడూ తినలేదు నాయనా" అని చెప్పింది. "మీరిద్దరూ రీల్ పేయిరా...రియల్ పేయిరా" అని గగన్ ని అడిగాడు. "నిజం చెప్పాలంటే నాకు భూమి ఫ్రెండ్ కంటే కూడా ఎక్కువ" అన్నాడు. దానికి రవి "అలాంటి అమ్మాయినే కదా మనం వైఫ్ గానో, గర్ల్ ఫ్రెండ్ గానో కోరుకుంటాం" అని చెప్పాడు. ఇక భూమి - గగన్ రియల్ లైఫ్ లో లవ్ ఉంటే ఈ దండలు మార్చుకోండి అంటూ రవి రెండు పూల దండలు ఇద్దరికీ చెరొకటి ఇచ్చాడు. ఇక ఫైనల్ గా ఈ స్టేజి కాస్త పెళ్ళిచూపులకి వేదికయ్యింది. ఐతే మరి వీళ్ళు దండలు మార్చుకుంటారా లేదా అన్నది నెక్స్ట్ వీక్ షోలో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
